నివర్ ఎఫెక్ట్.. వెంకన్న సన్నిధానంలో వర్షం
అకాల వర్షం ఆలయాన్ని సందర్శించే శ్రీవారి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

X
prasanna25 Nov 2020 6:38 AM GMT
నివర్ తుఫాను ప్రభావం తిరుపతిపై పడింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి తిరుమలలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. అకాల వర్షం ఆలయాన్ని సందర్శించే శ్రీవారి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం ఉండడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. కనుమ దారుల్లో భక్తులకు సూచనలు చేయడంతో పాటు కొండ చరియలు విరిగి పడే ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజనీరింగ్ విభాగం అప్రమత్తమైంది.
Next Story