నివర్ ఎఫెక్ట్.. తిరుమలలో కుండపోత

నివర్ ఎఫెక్ట్.. తిరుమలలో కుండపోత
పాపవినాశనం వద్ద అత్యధికంగా 31 సెంటిమీటర్ల వర్షపాతం

నివర్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తిరుమల వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. బలంగా వీస్తున్న ఈదురు గాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి. పాపవినాశనంకు వెళ్లే దారిలో కూలిన వ‌ృక్షాలను అటవీ సిబ్బంది తొలగించారు. విరిగిపడిన కొండచరియలను టిటిడి సిబ్బంది తొలగిస్తున్నారు. వాహనదారులు ఘాట్ రోడ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొన్నారు. పాపవినాశనం వద్ద అత్యధికంగా 31 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. గోగర్భం డ్యాం వద్ద 25 సెంటిమీటర్లు, ఆకాశగంగ వద్ద 18 సెంటిమీటర్లు, కుమారధార పసుపుధార డ్యాంల వద్ద 15.5 సెంటిమీటర్లు, తిరుమలలో 12.5 సెంటిమీటర్లు వర్షపాతం నమోదయింది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story