ఏపీకి భారీగా అక్రమ మద్యం రవాణా

ఏపీకి భారీగా అక్రమ మద్యం రవాణా
ఏపీలో మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రోజూ ఎక్కడో ఒక చోటు అక్రమ మద్యం రవాణా బయటపడుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో..

ఏపీలో మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రోజూ ఎక్కడో ఒక చోటు అక్రమ మద్యం రవాణా బయటపడుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. పెద్ద ఎత్తున మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఎక్సైజ్‌ పోలీసుల కన్నుగప్పేందుకు అక్రమ రాయుళ్లు.. మద్యం బాటిళ్లను పరుపుల్లో తెలంగాణ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. టాటా ఏస్ వాహనంలో పరుపుల్లో పెట్టి తరలిస్తున్న వెయ్యి మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. మొత్తం ౩ చెక్‌ పోస్టులలో.. ఆరు లక్షల విలువైన వెయ్యి మద్యం సీసాలు, లక్షా 73 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులో తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story