ఏపీ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

X
Nagesh Swarna8 Oct 2020 3:02 PM GMT
ఏపీ పోలీసులపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏపీలో సీబీఐ అధికారులు ఆఫీస్ తెరవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొంది. పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తీసుకెళ్లిన తర్వాత జడ్జి ముందు 24 గంటల్లోపు హాజరుపరచటం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజ కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ విచారణకు సంబంధించి పోలీసుల తరపు కౌన్సిల్ చేసిన వాదనలపై హైకోర్టు స్పందించింది.ఇలా అయితే హెబియస్ కార్పస్ కేసు సీబీఐతో విచారణ చేయించాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
Next Story