ఆంధ్రప్రదేశ్

మందడంలో రైతుల వినూత్న నిరసన

అమరావతి రాజధాని ఉద్యమంలో భాగంగా మందడం రైతులు వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా... ఓ వ్యక్తితో మోదీ మాస్క్ ధరింపజేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు..

మందడంలో రైతుల వినూత్న నిరసన
X

అమరావతి రాజధాని ఉద్యమంలో భాగంగా మందడం రైతులు వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా... ఓ వ్యక్తితో మోదీ మాస్క్ ధరింపజేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్‌ ధరించిన వ్యక్తికి అమరావతి గురించి వివరాలు చెప్పారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించవద్దని మోదీ మాస్క్‌ వేసుకున్న వ్యక్తికి మహిళలు విన్నవించారు. 275 రోజులుగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలో.. రైతులు, మహిళలు రోజుకోరకంగా నిరసన తెలుపుతున్నారు. అనేక రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ రోజు మోదీ బర్త్ డే కావడంతో.. ఇలా మోదీ మాస్క్‌ ధరించిన వ్యక్తికి తమ కష్టనష్టాలను వివరించారు.

Next Story

RELATED STORIES