Top

వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు.. అసెంబ్లీని ముట్టడిస్తామంటూ..

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రైతులకు 35వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు

వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు.. అసెంబ్లీని ముట్టడిస్తామంటూ..
X

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రైతులకు 35వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

వైజాగ్, పులివెందుల, అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా సరే ముట్టడించడం ఖాయమన్నారు. అనంతరం మంత్రి కొడాలి నానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శతకోటి లింగాలలో నాని ఓ బోడి లింగామని విమర్శించారు. కొడాలి నాని.. మీ సీఎం సాబ్ కి చెప్పు వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడని సూచించారు.

పేకాట క్లబ్ లు మీద ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంపై లేదని మండిపడ్డారు. మంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మీరు టీవీ ఛానళ్లు, పేకాట క్లబ్బులు నడుపుతూ రాజకీయం చేయవచ్చుగానీ.. తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం రైతులను పట్టించుకోకుంటే తానే రోడ్లపైకి వస్తానని పవన్ తెలిపారు. నివర్ తుపాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంత్రులు తిట్టడానికి ముందు ఉంటారు కానీ ప్రజా సమస్యలను పరిష్కరించండంలో వెనక ఉంటారన్నారు పవన్ కల్యాణ్.

Next Story

RELATED STORIES