ఆంధ్రప్రదేశ్

టీటీడీ నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి

టీటీడీ నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి
X

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేరిట నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జవహర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు లేదా రేపు జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ ఇటీవలే బదిలీ అయ్యారు. మూడేళ్లకుపైగా సింఘాల్‌ పదవిలో కొనసాగారు.. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం సెప్టెంబరు 30న అనిల్‌ సింఘాల్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డికి అదనపు ఈవోగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తాజాగా జవరహర్‌ రెడ్డిని పూర్తి స్థాయి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

RELATED STORIES