91 వేల ఉద్యోగాలపై ఒక సీఎం ప్రకటన చేయడం చరిత్రలో మొదటి సారి: జేసీ దివాకర్ రెడ్డి

91 వేల ఉద్యోగాలపై ఒక సీఎం ప్రకటన చేయడం చరిత్రలో మొదటి సారి: జేసీ దివాకర్ రెడ్డి
JC Diwakar Reddy : ఒక ముఖ్యమంత్రి 91 వేల ఉద్యోగాల గురించి చెప్పడం చరిత్రలో మొదటిసారన్నారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి.

JC Diwakar Reddy : ఒక ముఖ్యమంత్రి 91 వేల ఉద్యోగాల గురించి చెప్పడం చరిత్రలో మొదటిసారన్నారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. ఈ ప్రకటనతో యూత్‌లో కచ్చితంగా క్రేజ్ వస్తుందన్నారు. పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నారు. ఆంధ్రాలో ఉన్న ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్నారు. జగన్ మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లే భావిస్తున్నానన్నారు. సీఎంలను కలవాలంటే ఒకప్పటిలా లేదన్నారు. తెలంగాణ సీఎంను కలిసేందుకు వెళ్లిన వీలు కాలేదన్నారు

ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో 91 వేల 142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో దాదాపు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. మిగిలిన 80 వేల 39 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఒక్క విద్యా శాఖలోనే దాదాపు 20 వేల నుంచి 30 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ఏర్పాట్లు చేశామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story