విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో..
BY kasi25 Oct 2020 4:21 AM GMT

X
kasi25 Oct 2020 4:21 AM GMT
ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేంద్రం పేదలకు అండగా నిలిచిందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట.. రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కల్గించాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.
Next Story
RELATED STORIES
Ashoka Vanamlo Arjuna Kalyanam Review: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఎలా...
6 May 2022 3:41 AM GMTAcharya Review: 'ఆచార్య' రివ్యూ.. మెగా పెర్ఫార్మెన్స్ అదుర్స్.....
29 April 2022 2:45 AM GMTBeast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. యాక్షన్తో పాటు కామెడీ కూడా...
13 April 2022 3:35 AM GMTGhani Movie Review: గని మూవీ రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్ ప్లస్...
8 April 2022 4:03 AM GMTRadhe Shyam Review: ఈ 6 అంశాలే 'రాధే శ్యామ్'కు పెద్ద ప్లస్..
11 March 2022 1:00 PM GMTET Movie Review: 'ఈటీ' మూవీ రివ్యూ.. తన యాక్టింగ్ సినిమాకు మైనస్..
10 March 2022 9:56 AM GMT