మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి : హిందూ సంఘాలు

మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి : హిందూ సంఘాలు
ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు గరుడ వాహన సేవ జరగనుంది. ఈ ఉత్సవానకి సీఎం జగన్‌ హాజరువుతున్నారు..

ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు గరుడ వాహన సేవ జరగనుంది. ఈ ఉత్సవానకి సీఎం జగన్‌ హాజరువుతున్నారు.. అయితే సీఎం కచ్చితంగా డిక్లరేషన్‌పై సంతం పెట్టే ఆలయంలోకి ప్రవేశించాలని.. ధార్మిక సంఘాలు, విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు.. అయితే అధికార పార్టీ నేతలు కాని.. టీటీడీ పాలకమండలి కాని.. అందుకే సిద్ధంగా లేవు. స్వామి అత్యంత ఎక్కువగా నమ్మే జగన్‌ డిక్లేరేషన్‌ ఇవ్వాళ్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్‌ సైతం స్పష్టం చేశారు..

అయితే సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమలలో అడుగు పెట్టడానికి వీళ్లేదని ధార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.. అనాథిగా వస్తున్న సంప్రదాయాలను ఎందుకు మారుస్తున్నారని టీటీడీ తీరుపై మండిపడుతన్నాయి.. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మరోవైపు మంత్రి కొడాలి నాని సైతం తన వ్యాఖ్యలను ఇప్పటి వరకు వెనక్కు తీసుకోకపోవడంపైనా భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు.. మంత్రి నాని బహిరంగా క్షమాపణలు చెప్పడంతో పాటు తన మంత్రి పదవి రాజీనామా చేయాలని వివిధ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story