ఆంధ్రప్రదేశ్

అరెస్టయిన రైతుల కుటుంబాలకు లోకేశ్ పరామర్శ

రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేయడం అత్యంత దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు..

అరెస్టయిన రైతుల కుటుంబాలకు లోకేశ్ పరామర్శ
X

రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేయడం అత్యంత దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. బాధ్యులైన అధికారుల్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కృష్ణాయపాలెంలో పర్యటించిన లోకేశ్..

అరెస్టయిన రైతుల కుటుంబాల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రైతుల కుటుంబ సభ్యులు కంట తడి పెట్టుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని విలపించారు. కూలీ చేసుకునే తమకు బేడీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. రైతు రాజ్యం అంటే ఇదేనా అని ఆవేదన వ్యక్తంచేశారు. డీఎస్పీని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES