Machilipatnam : కృష్ణా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం

ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను రానీయకుండా అడ్డుపడ్డట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు

మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. SFI జిల్లా కార్యదర్శి పవన్‌ కుమార్‌ను ఈడ్చుకుంటూ వెళ్లారు. వర్సిటీ తలుపులు మూసి పవన్‌కుమార్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. పోలీసుల దాడిలో పవన్‌ స్పృహ కోల్పోయారు. ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను రానీయకుండా అడ్డుపడ్డట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించడం కూడా తప్పేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న కృష్ణా వర్సిటీలో మౌళిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించా రు. విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఇక స్టూడెంట్స్‌ చేపట్టిన నిరసనకు SFI జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్‌ మద్దతు తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ కుమార్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇదేం పద్దతి అంటూ నిలదీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story