దారుణం.. భార్యాభర్తల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తి తలదూర్చడంతో..
BY Nagesh Swarna29 Sep 2020 10:12 AM GMT

X
Nagesh Swarna29 Sep 2020 10:12 AM GMT
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మధ్యవర్తి తలదూర్చడంతో ఒకరు మృత్యువాతపడ్డారు. పట్టణంలోని నందమూరి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భర్తకు మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓబులేసు అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్య రమాదేవి, కూతురు కావ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఉప్పు బాషా అనే వ్యక్తి మధ్యలో తలదూర్చాడు. ఓబులేసు, ఉప్పుబాషా మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఉప్పుబాషా.. బలంగా తోయడంతో ఓబులేసు కిందపడ్డాడు. అప్పటికే గాయపడి అపస్మారకస్థితిలో ఉన్న ఓబులేసును.. బాషా కాళ్లతో తన్నడంవల్లే మరణించాడని భార్య రమాదేవి ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
CBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యూరో ఆఫ్...
24 May 2022 4:43 AM GMTIAF Group C Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో...
23 May 2022 4:42 AM GMTSouthern Railway Sport Quota Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో...
21 May 2022 5:15 AM GMTIndian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMTMinistry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMT