Andhra Pradesh: ఏపీలో సినిమా వర్సెస్‌ పాలిటిక్స్‌

Andhra Pradesh: ఏపీలో సినిమా వర్సెస్‌ పాలిటిక్స్‌
తారాస్థాయికి చేరుకున్న పొలిటికల్‌ హీట్‌; ఏపీ సెంట్రిక్‌ గా సినీ స్టార్స్‌ హాట్‌ కామెంట్స్‌

ఏపీలో పరిస్థితి సినిమా వర్సెస్‌ పాలిటిక్స్‌గా మారింది. వాల్తేరు వీర‌య్య రెండొంద‌ల రోజుల ఫంక్షన్‌లో వైసీపీ ప్రభుత్వంపై చిరు చేసిన కామెంట్లు.. పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.దీనికి తోడు సూపర్‌ స్టార్‌రజనీకాంత్‌ జైలర్‌ మూవీ ప్రమోషన్‌లో చేసిన కామెంట్స్‌ కూడా వైసీపీ నేతలకు సూటిగా గుచ్చుకున్నాయి.చిరు కామెంట్స్‌కు వైసీపీ నేతలు, మంత్రులు వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు. దీంతో గోటితో పోయేదాన్ని గొడ్డలి వ‌ర‌కూ తెచ్చుకొంటోంది వైసీపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికే మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా లో గా వైసీపీ శ్రేణుల‌కు గ‌ట్టి స‌మాధానం చెబుతున్నాయి.మా హీరోల జోలికొస్తే ఊరుకోం..అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అటు పొలిటికల్‌ పార్టీలు కూడా చిరంజీవి అన్న మాటల్లో తప్పేముందంటూ కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.

మరోవైపు ఏపీలో బ్రో సినిమా పంచాయితీ కొనసాగుతోంది. సినిమాలో తన క్యారెక్టర్‌ను పెట్టారంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌తో పాటు నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇటు జనసేన కార్యకర్తలు కూడా మంత్రి అంబటి రాంబాబుతో పాటు సీఎం జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.అంబటి రాంబాబు విమర్శలతో సీన్‌లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు చిరు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని.. పోలవరంతో పాటు అనేక సమస్యలు పరిష్కరించాల్సింది పోయి..పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమాల మీద పడటం ఏంటని ప్రశ్నించారు. పోలవరం, రోడ్లు వంటి సమస్యలు ఏపీలో చాలానే ఉన్నాయన్నారు. అంతే... అప్పటి వరకు జనసేన అంబటిగా సాగిన వివాదం చిరు వర్సెస్ వైసీపీగా మారింది.

ఇక మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా? అంటూ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఏపీలో వైసీపీ ఫ్యాన్స్ హర్టవుతున్నారట.. ఇటీవల ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీ వచ్చిన రజనీకాంత్ మాట్లాడిన మాటలకు, వైసీపీ ఇచ్చిన కౌంటర్లకు స్క్రీన్ పై సమాధానం ఇచ్చేశాడని అంటున్నారు రజనీ ఫ్యాన్స్‌.

మరోవైపు చిరంజీవి మాటలపై వైసీపీ కుక్కలు రోడ్ల పెకొచ్చి మొరుగుతున్నాయని, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని లోకేశ్‌ ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ పై రాజకీయాలు చెయ్యొద్దన్నారని, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

కల్పించాలని అన్నారని చెప్పారు. నాలుగేళ్ల 3 నెలల్లో జగన్‌ చేసింది ఏమీ లేదు కాబట్టే వైసీపీ కుక్కలకు కోపం వచ్చిందన్నారు. చంద్రబాబుని, తనను, పవన్‌ కల్యాణ్‌ని విమర్శిస్తూ కట్టు కథతో సినిమా తీసిన రోజు ఈ వైసీపీ కుక్కలకు విలువలు గుర్తు రాలేదా? అని నిలదీశారు.

అయితే సినిమా హీరోలు కొందరు 50 కోట్ల నుంచి వంద కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని.. అందులో సగానికి కూడా ఆదాయపు పన్నుచెల్లించడం లేదని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు.ఆ హీరోలు తమ వద్ద పని చేసేవారికి కనీస వేతనాలు చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో ఒకాయన రెండుచోట్ల పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

మరోవైపు వైసీపీ నేతలపై చిరంజీవి ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్‌లోని విజయవాడ ప్రధాన రహదారిపై అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షిరాభిషేకం చేశారు. చిరంజీవికి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓటుతో గెలిచిన కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

మొత్తం మీద ఏపీలో పొలిటికల్‌ వర్సెస్ సినిమాగా మారడం హాట్‌ టాపిక్‌గా మారింది.రాజకీయ అగ్గిని రాజేశాయి.తమను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న విమర్శలపై సినీ స్టార్స్‌ ఎలా స్పందిస్తారన్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story