ఆంధ్రప్రదేశ్

బిగ్ బ్రేకింగ్.. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి

బిగ్ బ్రేకింగ్.. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి
X

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లి దుర్గాప్రసాద్‌ బుధవారం సాయంత్రం.. చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ మరణించారు. 1996-1998లో ప్రాథమిక విద్య మంత్రిగా పని చేశారు. నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు దుర్గా ప్రసాద్‌.

1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు.1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బల్లి దుర్గాప్రసాద్‌.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1996-98లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, 2009-14లో పీఏసీ మెంబర్‌గా సేవలు అందించారు. దుర్గాప్రసాద్ మృతిపట్ల ప్రముఖ నేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES