అరెస్ట్ వారెంట్ చూపించకుండా తీసుకెళ్ళారు : రఘురామ ఫ్యామిలీ

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..

అరెస్ట్ వారెంట్ చూపించకుండా తీసుకెళ్ళారు : రఘురామ ఫ్యామిలీ
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ పైన ఆయన కుటుంబం సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి ముందస్తు చర్యలు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. ఇప్పుడే నోటీసులు ఇచ్చి తీసుకెళ్తున్నారని అన్నారు.

ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండని పోలీసులు అన్నారని తెలిపారు. అయితే వచ్చిన పోలీసులందరూ సివిల్ డ్రెస్ లొనే ఉన్నారని, ఎవ్వరు కూడా ఐడి కార్డులు కూడా చూపించలేదని,అరెస్ట్ వారెంట్ కూడా చూపించలేదని, కుటుంబ సభ్యులకీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని అంటున్నారు. అందర్నీ తోసేసి దౌర్జ్యనంగా తీసుకెళ్లారని ఆయన కుమారుడు భరత్ అన్నారు.

అటు అరెస్టు సమయంలో రఘురామ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కొంతకాలం క్రితమే రఘురామకు హార్ట్ సర్జరీ జరిగింది. అటు రఘురామ పైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.. నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ గత కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.Next Story

RELATED STORIES