ఆంధ్రప్రదేశ్

హిందూ మనోభావాలు జగన్‌కు తెలిపేందుకే దీక్ష : ఎంపీ రఘురామ

ఆలయాలపై దాడుల్ని నిరసిస్తూ రఘురామ చేపట్టిన దీక్ష విరమించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష..

హిందూ మనోభావాలు జగన్‌కు తెలిపేందుకే దీక్ష : ఎంపీ రఘురామ
X

ఆలయాలపై దాడుల్ని నిరసిస్తూ రఘురామ చేపట్టిన దీక్ష విరమించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగింది. రఘురామ దీక్షకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ మద్దతు తెలిపారు. దీక్ష విరమణ అనంతరం మాట్లాడిన రఘురామ... ఆలయాలపై దాడుల్ని పిచ్చివాళ్ల చర్యగా చెప్పడం సరికాదని అన్నారు. హిందూ మనోభావాలు జగన్‌కు తెలిపేందుకే దీక్ష చేపట్టినట్టు వెల్లడించారు. అంతర్వేది ఘటనతో హిందూ సమాజం మేల్కొందని రఘురామ తెలిపారు. సనాతన స్వదేశీ సేన ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అటు... తాను రాజీనామా చేయాలని మంత్రి బాలినేనికి శ్రీనివాస్‌ రెడ్డి కోరడంపై రఘురామ మండిపడ్డారు. రాజీనామా చేస్తే గెలిస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నిక జగన్‌ రెఫరెండంగా భావించేందుకు జగన్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

Next Story

RELATED STORIES