ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతురాజ్యం : నారా లోకేశ్
రాజధాని గ్రామ రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారు..
BY kasi27 Oct 2020 11:02 AM GMT

X
kasi27 Oct 2020 11:02 AM GMT
రాజధాని గ్రామ రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారు. రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేశారు.. ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యం అంటూ ట్విట్టర్‌లో లోకేష్ ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే... తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు.. అమరావతిని చంపేస్తుంటే.. ఎంత కోపం రావాలి అంటూ నిలదీశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలని.. లేదంటే న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
Next Story
RELATED STORIES
K Raghavendra Rao: దర్శకేంద్రుడు రచించిన 'నేను సినిమాకి రాసుకున్న...
17 May 2022 2:02 PM GMTKarate Kalyani: కలెక్టర్ను కలిసి అన్ని విషయాలు వెల్లడించాను: కరాటే...
17 May 2022 12:24 PM GMTMahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ మూవీ అప్డేట్.. టైటిల్ రివీల్...
17 May 2022 12:05 PM GMTPrabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTAriyana Glory: నవంబర్లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో...
17 May 2022 10:15 AM GMTMahesh Babu: ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన మహేశ్.. హఠాత్తుగా స్టేజ్...
16 May 2022 4:15 PM GMT