Andhra Pradesh: ఒక నియంతపై పోరాటం : లోకేష్‌

Andhra Pradesh: ఒక నియంతపై పోరాటం : లోకేష్‌


ఏపీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ఒక నియంతతో, వైసీపీ గోబెల్‌ ప్రచారంపై పోరాటం చేస్తున్నామన్నారాయన. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైసీపీపై ఉందన్నారు. న్యాయం కోసమే తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కంతేరులో తనకు 14 ఎకరాలు ఉందని పోసాని ఆరోపించారని, దీనిపై న్యాయపోరాటం చేస్తుంటే అతను పారిపోయాడంటూ ఎద్దేవా చేశారు. నోటీసు పంపినా సమాధానం ఇవ్వలేదన్నారు.

తండ్రిపదవిని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచేశారన్నారు లోకేష్‌. తన తాత, తండ్రి ఇద్దరూ సీఎంగా ఏనాడు అక్రమ సంపాదన చేయలేదన్నారు. తాను తప్పు చేస్తే.... చంద్రబాబు తనను జైల్‌కు పంపుతారన్నారు. విజనరికి విజన్ ఉంటుంది.... ప్రిజనరికి జైలు ఉంటుందన్నారు లోకేష్‌. తనది కాలేజ్ లైఫ్ అయితే... .సీఎం జగన్ ది జైలు లైఫ్‌ అన్నారు. తనకు కేవలం పాస్ పోర్ట్, వీసా ఉంటే చాలు విదేశాలకు వెళ్లొచ్చన్న లోకేష్‌... అదే.. జగన్‌ విదేశాలకు వెళ్లాంటే కోర్టు అనుమతులు ఉండాలన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే టీవీ5పై జగన్‌ సర్కారు దాడి చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో టీవీ5 కేబుల్ నెట్‌వర్క్‌ రాకుండా చేశారన్నారు. ప్రజల పక్షాన టీవీ5 పోరాడుతుంటే... కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 62 ఏళ్ల మార్గదర్శిపైనా కావాలని దాడి చేస్తున్నారని...తద్వారా ఈనాడును భయపెట్టాలని చూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story