అలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది : నిమ్మగడ్డ రమేష్ కుమార్

అలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది : నిమ్మగడ్డ రమేష్ కుమార్
స్థానిక ఎన్నికల నిర్వహణపై వైసీపీ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ప్రభుత్వంతోను, వైద్యశాఖ అధికారులతోను SEC సంప్రదింపులు జరపలేదంటూ మాట్లాడడం..

స్థానిక ఎన్నికల నిర్వహణపై వైసీపీ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ప్రభుత్వంతోను, వైద్యశాఖ అధికారులతోను SEC సంప్రదింపులు జరపలేదంటూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. నిన్ననే వైద్యఆరోగ్యశాఖ అధికారులతో తాము చర్చలు జరిపామని స్పష్టం చేశారు. సంప్రదింపుల విషయంలో కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు. ఎన్నికల నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్‌ సింఘాల్‌తో పాటు, కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తో కోవిడ్‌ పరిస్థితిపై చర్చించామని అన్నారు. వైద్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకునేందుకు ఇవాళ CSతోనూ సమావేశం కానున్నట్టు వెల్లడించారు.

ఎలక్షన్ల నిర్వహణకు సంబంధించిన పిల్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించినట్టు చెప్తూ ఆ వివరాలపై ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఇవాళ్టి సమావేశానికి 19 పార్టీలకు ఆహ్వానం పంపగా 11 పార్టీలు నేరుగా హాజరై అభిప్రాయం చెప్పాయన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. 2 పార్టీలు లేఖల ద్వారా అభిప్రాయం తెలిపాయని వివరించారు. వైసీపీ సహా 6 పార్టీలు ఇవాళ్టి సమావేశానికి గైర్హాజరయ్యాయని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాల్లో.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగానే SEC పనిచేస్తుందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు SEC ఆహ్వానం పంపినా YCP హాజరు కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మెజార్టీ MLAల మద్దతు ఉందనే కారణంగా ఇలా వ్యవహరించడం తగదని విపక్షాలన్నీ YCPకి హితవు పలికాయి. కోవిడ్ విజృంభిస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసి.. ఇప్పుడు వాయిదా కోరడం వెనుక ఆ పార్టీ ఉద్దేశం ఏంటో ప్రజలకు ఈజీగానే అర్థమవుతోందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story