TV5 ఎఫెక్ట్‌.. సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆన్‌లైన్ సేవలు

TV5 ఎఫెక్ట్‌.. సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆన్‌లైన్ సేవలు
పీఎం పాలెం ప్రాంతాల్లో 10 శాతం నుంచి 30 శాతం మార్కెట్ వ్యాల్యూ పెరిగిందన్నారు. రేపటితో పలు ప్రాంతాల్లో మార్కెట్ వ్యాల్యు పెరుగుతాయని చెప్పారు.

TV5 ఎఫెక్ట్‌తో ఎట్టకేలకు విశాఖ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆన్‌లైన్ సేవలు మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లోనే అన్ని భూరిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు స్పష్టంచేశారు. ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా ఇవాళ పూర్తి చేస్తామన్నారు. అయితే సర్వీస్ ఛార్జీల వసూలుపై వస్తున్న అపోహలను ప్రజలు నమ్మొద్దని తెలిపారు. పీఎం పాలెం ప్రాంతాల్లో 10 శాతం నుంచి 30 శాతం మార్కెట్ వ్యాల్యూ పెరిగిందన్నారు. రేపటితో పలు ప్రాంతాల్లో మార్కెట్ వ్యాల్యు పెరుగుతాయని చెప్పారు.

సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ అయింది. దీంతో విశాఖ సహా అన్ని జిల్లాల్లోను ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రజలు నుంచి ఆగ్రహావేశాలు మిన్నంటాయి. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. మంగళవారం నుంచి మాన్యువల్‌గా భూరిజిస్ట్రేషన్లు జరపాలని ఆదేశించింది. ప్రజల తాకిడి సైతం మరింత పెరగడంతో నిన్నటి నుంచి 35 డాక్యుమెంట్లు మాన్యువల్‌గా రిజిస్ట్రేషన్లు చేశారు అధికారులు. అటు వరుస కథనాలతో అధికారుల్లో కదలిక తెచ్చిన టీవీ5కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story