ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడంటే?

ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడంటే?
పరిషత్ ఎన్నికల కోసం కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తారా? లేక ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతారా అన్న సందేహాలు మాత్రం ఇంకా ఉన్నాయి.

పంచాయతీ ఎన్నికలతోనే పంచాయితీ అయిపోదంటోంది ఎస్‌ఈసీ. డైరెక్టుగా చెప్పకపోయినా.. వస్తున్న సంకేతాలను బట్టి త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలనుకుంటోంది. రేషన్‌ వాహనాల రంగులపై అభ్యంతరం చెప్పిన ఎస్‌ఈసీ.. పంచాయతీ ఎన్నికలు ముగిసినా అలాగే ఉంచాలని చెప్పింది. స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు వైసీపీ రంగులు పునరుద్దరించవద్దని స్పష్టంగా తెలిపింది. రేషన్ వాహనాల రంగుపై జారీ చేసిన ఆదేశాల్లో పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే దాకా తటస్థ రంగులు కొనసాగించాలని చాలా స్పష్టంగా చెప్పింది.

ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయనే సంకేతాలు పంపింది. అయితే, పరిషత్ ఎన్నికల కోసం కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తారా? లేక ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతారా అన్న సందేహాలు మాత్రం ఇంకా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. పరిషత్ ఎన్నికలు జరపాలంటే నాలుగు వారాల పాటు కోడ్ అమల్లో ఉండాలి. ఆల్రడీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోనే ఉంది కాబట్టి.. పరిషత్ ఎన్నికలకు ఎటువంటి అడ్డంకులు ఉండవనేది ఎస్‌ఈసీ ఆలోచన. ఈనెల 21తో పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండడంతో.. ఆ వెంటనే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ఎస్‌ఈసీ.


Tags

Read MoreRead Less
Next Story