ఈ-సేవలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్

ఈ-సేవలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 17 ఏళ్ల నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారని అన్నారు. ఈ-సేవ ఉద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఐదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని అన్నారు. అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో 607 ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ-సేవ ఉద్యోగులకు ఉపాధికి లేక కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు సేవలు అందిస్తూ... ఈ-సేవ ఉద్యోగాలను నమ్ముకొని బతుకుతున్న వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని అన్నారు. సేవా రుసుముల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోందని, ఈ-సేవ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
RELATED STORIES
Kangana Ranaut: కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు.....
20 May 2022 3:30 PM GMTpushpa second part : పుష్ప సెకండ్ పార్ట్.. అంతకుమించి
20 May 2022 1:30 PM GMTKamal 'Vikram': యంగ్ హీరో చేతికి కమల్ 'విక్రమ్' తెలుగు రైట్స్..!
20 May 2022 11:30 AM GMTSameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో...
20 May 2022 9:30 AM GMTHappy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్...
20 May 2022 7:30 AM GMTNTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
20 May 2022 7:00 AM GMT