Guntur: గుంటూరు రాజకీయాల్లో మిర్చియార్డు ఘాటు.. ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ ఎవరని ఉత్కంఠ..

Guntur: గుంటూరు రాజకీయాల్లో మిర్చియార్డు ఘాటు.. ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ ఎవరని ఉత్కంఠ..
Guntur: ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Guntur: గుంటూరు రాజకీయాల్లో మిర్చియార్డు ఘాటు తగులుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్, వైఎస్‌ ఛైర్మన్‌ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆశావాహులు భారీగా ఉండటంతో.. పోటీ రసవత్తరంగా మారింది. మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ఇదివరకు.. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన యేసు రత్నంకు కట్టబెట్టారు. రెండో పర్యాయం సైతం ఛైర్మన్‌ పదవిని ఆయనకే దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుంది.

అటు మార్కెట్ యార్డు వైఎస్‌ ఛైర్మన్ పదవిపై ఎవరికనేది ఇంకా స్పష్టత రాలేదు. వైఎస్ ఛైర్మన్ కోసం వైసీపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీలో నేతల రాజకీయం సై అంటే సై అనే స్థాయి చేరాయి. వైఎస్‌ ఛైర్మన్ పదవిపై నజర్ పెట్టిన గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా చక్రం తిప్పేందుకు తనదైనశైలిలో పావులు కదుపుతున్నారు.

ఇదివరకే తన వ్యాపార భాగస్వామి సుధాకరెడ్డికి మార్కెట్ యార్డు కమిటీలో చోటుకల్పించిన ఎమ్మెల్యే ఇసారి ఏకంగా వైస్‌ ఛైర్మన్ పదవి ఇప్పించేందుకు ప్రతిపాదనలు చేయటం స్థానిక నేతలకు మింగుపడటంలేదు. పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్‌ నేతలను కాదని తన బిజినెస్ పార్టనర్‌ కోసం ఎమ్మెల్యే ముస్తాఫా ప్రతిపాదనలు చేయటం ఏంటని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్‌ ఎదుటే శ్రేణుల వాగ్వాదానికి దిగటంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి.

గుట్కా నిల్వల కేసు ఎదుర్కొంటున్న సుధాకర్ రెడ్డికి వైస్ ఛైర్మన్ కట్టబెడితే శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు నేతలు గట్టిగా వాదిస్తున్నారు. అటు మార్కెట్ యార్డు వైఎస్ ఛైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టడం పక్కనే పెడితే ఎమ్మెల్యే ముస్తాఫాపైనే నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు శ్రేణులు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధిని పక్కనపెట్టి..సొంత అజెండాతో వెళ్తారనే అపవాదు ఉన్నట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story