పోలవరం ప్రాజెక్ట్ పై బాంబు పేల్చిన కేంద్రం..

పోలవరం ప్రాజెక్ట్ పై బాంబు పేల్చిన కేంద్రం..

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రాజెక్ట్‌ డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పునరావాస, పరిహార ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. 2015 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి 8,614.16 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. నాబార్డు నుంచి రూ.8,614.16 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.950 కోట్లు మంజూరైనట్లు వెల్లడించింది. నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు మంజూరైనట్లు తెలిపింది. పోలవరానికి చేసిన వ్యయంలో ఇంకా రూ.2,234.77 కోట్లు పెండింగ్‌ ఉందని, ఇప్పటి వరకు పునరావాసంతో కలిపి 41.05శాతం మేర నిర్మాణం అయినట్టు వెల్లడించింది

పోలవరం ఉనికి ప్రమాదంలో పడినా సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. అత్యంత కీలకమైన అంశంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. పోలవరం అంచనాలపై వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాల వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని.. CM ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడాలని సూచించారు. పోలవరం నిర్మాణం విషయంలో TDPపై విమర్శలు మానుకోవాలని దేవినేని ఉమ హితవు పలికారు.

పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం‌ చేస్తోందని, నిధుల విషయంలో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జనసేనతో కలిసి త్వరలో ప్రజాఉద్యమాలు చేపడతామన్నారు. పునరావాస, పరిహారం ప్యాకేజీలతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనమేనంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story