తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

X
kasi24 Nov 2020 8:55 AM GMT
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలలో పద్మావతి విశ్రాంతి భవనంలో విడిది చేశారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు.. రాష్ట్రపతి దంపతులకు టీటీడీ చైఐర్మన్ వివి సుబ్బారెడ్డి.. ఇతర నేతలు, ఆలయ అధికారులు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. కొద్దిసేపు పద్మావతి అతిథి గృహంలో బసచేసిన తరువాత స్వామివారిని దర్శించుకోనున్నారు. మొదట సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరహాస్వామి వారిని దర్శించుకుంటారు.. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్లి.. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
Next Story