తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

X
Nagesh Swarna24 Nov 2020 8:14 AM GMT
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయనకు... గవర్నర్, సీఎం స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుచానూరు చేరుకుని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించారు. పూర్ణకుంభంతో రాష్ట్రపతి కోవింద్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆహ్వానించారు. దర్శనమనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వరాహ స్వామివారిని, శ్రీవారి దర్శించుకుంటారు. అనంతరం తిరిగి చెన్నైకు బయలుదేరతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Next Story