మహారాజ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

మహారాజ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

మహారాజ కళాశాలను ప్రైవేటు పరం చేసే దిశగా మాన్సాస్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.. మూడరోజు కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.. కళాశాలను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.. తమ జీవితాల గురించి మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ సంచయిత ఆలోచించాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే ఇంటర్‌ విద్యను రద్దు చేస్తూ, డిగ్రీని కూడా జీరో అకడమిక్‌ ఇయర్‌గా చేస్తూ మాన్సాస్‌ కరస్పాండెంట్‌ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. యాజమాన్యం తీరుతో వేలాది మంది విద్యార్థుల ఎంఆర్‌ కళాశాలకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాలేజీని ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని తమను ఆదుకోవాలని విద్యార్థులంతా డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story