ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన ట్రైన్.. జనం ఆర్తనాదలు.. ఏం జరిగిందంటే?

ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన ట్రైన్.. జనం ఆర్తనాదలు.. ఏం జరిగిందంటే?
జనం ఆర్తనాదాలు.. హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.

పట్టాలపై ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది. జనం ఆర్తనాదాలు.. హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వైద్య బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇది నిజం కాదు. నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే నిర్వహించిన మాక్‌ డ్రిల్‌.

రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే శాఖ సిబ్బంది తీసుకునే సత్వర చర్యలపై విజయవాడ సెక్షన్‌ అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. రైలు పట్టాలు తప్పినప్పుడు, బోగీల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాకచక్యంగా వ్యవహరించి ప్రజలను ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు. రైల్వేశాఖకు చెందిన అన్ని యూనిట్ల పనిముట్లు, సిబ్బందితో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.



Tags

Read MoreRead Less
Next Story