రాజంపేటలో భారీగా ప్రభుత్వ భూములు స్వాహా

రాజంపేటలో భారీగా  ప్రభుత్వ భూములు స్వాహా
నందలూరు మండలంలో వందల ఎకరాల కబ్జా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలు

రాజంపేటలో భారీగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందలూరు మండలంలో వందల ఎకరాలను రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కబ్జా చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో వందల ఎకరాల భూములకు రెవెన్యూ అధికారుల సహకారంతో డికేటి పట్టాలను పొందారు.

ఎమ్మెల్యే మేడా తమ్ముడు రఘునాథ రెడ్డి పేరిట 3, మరో తమ్ముడు మధుసూదన్ రెడ్డి 17, ఎమ్మెల్యే చిన్నాన్న నందలూరు మండలం ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి భార్య పద్మజ పేరిట ఆరు ఎకరాలు..మేడా శ్రావణ్ కుమార్ రెడ్డి పేరుతో 10 ఎకరాలు..శ్రావణి రెడ్డి పేరుతో తొమ్మది ఎకరాలకు పట్టాలు పొందారు. అలాగే ఎమ్మెల్యే చిన్నాన్న కుమారుడు ఎర్ర చెరువుపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఐదు మరొక తమ్ముడు విజయ్ శేఖర్ రెడ్డి 2.45, చెల్లెలు లక్ష్మీదేవి 8 ఎకరాల ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారుల సహకారంతో డీకేటి పట్టాలను పొందారని.. ఆ భూముల్లో శ్రీగంధం, మామిడి చెట్లను నాటారు.

Tags

Read MoreRead Less
Next Story