ఆంధ్రప్రదేశ్

తిరుపతి శేషాచలం అడవుల్లో మరోసారి అలజడి.. 40మంది స్మగ్లర్లు..

తిరుపతి శేషాచలం అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. బాకరాపేట అటవీప్రాంతంలోని బొమ్మాజీకోన వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా..

తిరుపతి శేషాచలం అడవుల్లో మరోసారి అలజడి.. 40మంది స్మగ్లర్లు..
X

తిరుపతి శేషాచలం అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. బాకరాపేట అటవీప్రాంతంలోని బొమ్మాజీకోన వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. 40మంది స్మగ్లర్లు తారసపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. వారు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి దట్టమైన అటవీప్రాంతంలో తప్పించుకున్నారు. వారు వదిలేసిన 40 లక్షలు విలువచేసే 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనంచేసుకున్నారు. తప్పించుకున్న స్మగ్లర్లకోసం టాస్క్ ఫోర్స్ అధికారులు అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

Next Story

RELATED STORIES