సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ విజయవాడలో ఆందోళన

X
Nagesh Swarna1 Dec 2020 9:38 AM GMT
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ధర్నాచౌక్‌లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యలో ధర్నా చేపట్టారు. రాబోయే రోజుల్లో జగన్ అరాచక పాలనకు దళితులు, మైనార్టీలు చరమగీతం పాడతారని మండిపడ్డారు.
అబ్దుల్ కలాం ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా. రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చిన తరువాత ముస్లిం, దళిత వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వెంటనే అబ్దుల్ సలాం కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు. జగన్ కడుపులో విషాన్ని పెట్టుకుని.. మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు సలాం న్యాయపోరాట సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షూబ్లీ. సలాంకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
Next Story