ఏపీ పోలీస్ స్టేషన్లపై SEB దాడుల కలకలం
ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-SEB అధికారులు చేస్తున్న దాడులు కలకలం రేపుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు స్టేషన్లపై SEB అధికారులు దాడులు..

ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-SEB అధికారులు చేస్తున్న దాడులు కలకలం రేపుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు స్టేషన్లపై SEB అధికారులు దాడులు నిర్వహించారు. అర్థరాత్రి కొయ్యలగూడెంలో పీఎస్‌లో సోదాలు నిర్వహించారు. కీలకమైన ఫైల్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను.. SEB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొయ్యలగూడెం స్టేషన్ టైపిస్ట్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. టైపిస్ట్ నివాసంలో కంప్యూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులు ఫైల్స్‌ను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. .SEB అధికారుల దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే జంగారెడ్డి గూడెం పీఎస్‌లో SEB అధికారులు దాడులు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డి గూడెం CI, SIలను.. వీఆర్‌కు బదిలీ చేశారు అధికారులు.
భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11లక్షల 16 వేల 842 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 90,122 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 50లక్షల 20వేల 359కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 39లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 95వేల యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది కోలుకున్నారు.
RELATED STORIES
Ananthababu : డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో తెరపైకి కొత్త ప్రశ్నలు
20 May 2022 10:30 AM GMTChandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు
20 May 2022 7:55 AM GMTYSRCP : వైసీపీ నేతలకు దినదిన గండంగా గడప గడప కార్యక్రమం
20 May 2022 5:15 AM GMTAnantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం
20 May 2022 4:15 AM GMTChandrababu : డోన్ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ప్రకటించిన...
20 May 2022 1:30 AM GMTAyyanna Patrudu : జైల్లో ఉండే వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రం ఎలా...
19 May 2022 12:30 PM GMT