ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలి : బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలి : బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
X

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రెండో అంశానికి తావులేదన్నారు. సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న ఆయన.. 2024లో BJPకి అధికారం ఇస్తే అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తాను నరేంద్ర మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నానని, జగన్‌లాగ తాము మాట తప్పం.. మడమ తిప్పమని స్పష్టం చేశారు. రాజధాని రైతులతో తక్షణం చర్చలు జరపాలని, వారికి ఇచ్చిన ప్లాట్లు కూడా అభివృద్ది చేయాలని అన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళనంలో రైతు సంఘాలతో కలిసి పాల్గొన్న సోము వీర్రాజు.. జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు.

Next Story

RELATED STORIES