AP TDP: అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

AP TDP: అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం
ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు... పోలీసుల తీరుపై మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, కేసులతో అయ్యన్న గొంతు నొక్కాలి అని చూస్తున్నారన్నారని ఆరోపించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే తాను దైర్యంగా ఉన్నానని.. జగన్‌ అసమర్థ ప్రభుత్వాన్ని వదిలేది లేదని అయ్యన్న చంద్రబాబకు చెప్పారు. ఇక ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబుకు అయ్యన్న ధన్యవాదాలు తెలిపారు.

ఇక అయ్యన్న అరెస్ట్‌పై జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. అయ్యన్నపై అక్రమ కేసులతో వేధింపులను ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేసే దారుణ పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే, ప్రశ్నించే అయ్యన్నపై అక్రమ అరెస్టుతో కక్ష సాధిస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే.... మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లో పెట్టాలన్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారని... ధైర్యం ఉంటే విమర్శలకు సమాధానం చెప్పాలని అన్నారు. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో ఇలా పోలీసులు భాగస్వాములు అయితే ఆ అధికారులు తీవ్ర మూల్యం చెల్లిస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story