ఆంధ్రప్రదేశ్

సబ్బంహరి ఇంటిని కూల్చివేయడానికి కుట్ర పన్నారు : నారా లోకేశ్

సబ్బంహరి ఇంటిని కూల్చివేయడానికి కుట్ర పన్నారు : నారా లోకేశ్
X

సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. విధ్వంసం ఆ వ్యాధి ప్రధాన లక్షణమన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న అక్కసుతో... కనీసం నోటీసు ఇవ్వకుండా టీడీపీ నేత సబ్బంహరి ఇంటిని కూల్చివేయడానికి కుట్ర పన్నారని .. లోకేష్‌ ఆరోపించారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరిపై కక్షసాధింపు చర్యలు జగన్‌ రెడ్డిని మరింత దిగజార్చాయన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తాం... విమర్శిస్తే కూల్చేస్తాం అంటూ. జగన్‌ తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణచి వేయడం నియంతలకు సాధ్యంకాదన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు లోకేష్‌.

Next Story

RELATED STORIES