TDP vs YCP : అంబటి రాంబాబు ట్వీట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న

TDP vs YCP : అంబటి రాంబాబు ట్వీట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న
పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడంపై అంబటి ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సెటైర్ వేశారు. అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... 'రాష్ట్రంలో ఇల్లు లేని వారు.. ఎవరి ఇంటికి ఎవరు వెళ్లినా.. చివరకు అక్కడే స్థిరపడతారు' అని వ్యాఖ్యానించారు. దీనిపై అయ్యపాత్రుడు స్పందిస్తూ... 'సీట్ పోయింది.. ట్వీట్ మిగిలింది.. అయ్యయ్యో అంబటి' అని ఎద్దేవా చేశారు.

ఏపీలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల అధినేతలు గెలుపే లక్ష్యంగా తమతమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సుమారు రెండు గంటలపాటు వీరి మధ్య విస్తృత చర్చ జరిగింది. సీట్ల కేటాయింపు, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితర అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇక నుంచి కలిసికట్టుగా బహిరంగ సభల నిర్వహణపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలాఉంటే పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. కొద్దిసేపటికే జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేస్తూ అంబటి ట్వీట్ చేశారు. ‘నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి.. అర్థమయిందా! నాదెండ్ల విముక్త జనసేన కోసం పోరాడేవాడే అసలైన సైనికుడు’ అంటూ అంబటి సెటైరికల్ ట్వీట్ చేశారు. అయితే, అంబటి ట్వీట్లపై టీడీపీ, జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. అంబటి ట్వీట్లకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు ట్వీట్ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్లువేస్తూ ట్వీట్లు చేశాడు. వీరి మధ్య ట్వీట్ల వార్ జరగడం కొత్తేమీ కాదు.. గతంలో పలుసార్లు టీడీపీ, చంద్రబాబును ఉద్దేశించి అంబటి సోషల్ మీడియాలో పోస్టులకు అయ్యన్న స్పందిస్తూ కౌంటర్లు ఇచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story