అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల బృందం పర్యటన
అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను టీడీపీ నేతల..
BY kasi8 Sep 2020 2:11 PM GMT

X
kasi8 Sep 2020 2:11 PM GMT
అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను టీడీపీ నేతల బృందం పరిశీలించింది.. రాజధాని రైతులు, దళితులు, అమరావతి జేఏసీతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆ ప్రాంతంలో పర్యటించారు. రాజధానిలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అన్యాయానికి గురవుతున్నారని మండిపడ్డారు. రాజధానిలో 5,500 ఇళ్లను గత ప్రభుత్వం నిర్మిస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులేసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.
Next Story
RELATED STORIES
Fuel And Gas Rates: దేశ ప్రజలకు శుభవార్త.. చమురు, గ్యాస్ ధరలపై...
21 May 2022 2:45 PM GMTKCR: భవిష్యత్తులో ఆ సంచలనాన్ని చూడబోతున్నారు- సీఎం కేసీఆర్
21 May 2022 2:01 PM GMTAssam: వరద బీభత్సం.. ఇళ్లు కోల్పోయి రైల్వే ట్రాక్పై 500 కుటుంబాలు..
21 May 2022 11:37 AM GMTEmergency Landing: ఆకాశంలో ఆగిన విమానం.. ప్రయాణీకుల్లో భయం
21 May 2022 10:45 AM GMTUttarakhand: ఉత్తరాఖండ్లో ప్రమాదం.. రహదారిపై చిక్కుకున్న 10 వేల మంది...
21 May 2022 9:15 AM GMTVikram Agnihotri: కాలితో కారు డ్రైవింగ్.. సెల్యూట్ చేసిన ఆనంద్...
21 May 2022 9:00 AM GMT