ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఈవో బదిలీ.. అనిల్ కుమార్ స్థానంలో ధర్మారెడ్డి

టీటీడీ ఈవో బదిలీ.. అనిల్ కుమార్ స్థానంలో ధర్మారెడ్డి
X

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనను ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి TTD ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే అది తాత్కాలికమేనంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేఎస్‌ జవహర్‌రెడ్డిని TTD ఈవోగా నియమించనున్నట్లు సమాచారం.

1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌.. 2017, మే నుంచి TTD ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. TTD ఈవోగా ఆయన తనదైన ముద్ర వేశారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భక్తులు క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి చూడటం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి టైంస్లాట్‌ విధానాన్ని తీసుకొచ్చారు. సుదీర్ఘకాలం TTD ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు నిర్వహించారు. 2017, మే 6వ తేదీన ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఇప్పటికి మూడేళ్ల నాలుగు నెలల పాటు ఈవోగా ఉన్నారు.

Next Story

RELATED STORIES