ఈనెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు.. నిర్వహణపై సందిగ్ధత

ఈనెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు.. నిర్వహణపై సందిగ్ధత
ఈనెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటి నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది.. పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం..

ఈనెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటి నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది.. పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం.. కేవలం 37 రోజుల ముందు హడావిడిగా 230 కోట్లు కేటాయించింది.. నిధులున్నా, సమయం లేకపోవడంతో ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు.. కరోనా కారణంగా స్నానాలు వద్దని, కేవలం నెత్తిన నీళ్లు చల్లుకుంటే చాలని ప్రభుత్వం చెబుతోంది. భక్తులను స్నానాలకు అనుమతించాలా వద్దా.. నీళ్లు చల్లుకుంటే చాలా లేక షవర్‌ బాత్‌లు పెట్టాలా అనే దానిపై స్పష్టత లేదు.. అధికార పార్టీ నేతల జేబులు నింపడానికే నిధులు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story