APSRTC: బస్సు ప్రమాద ఘటనలో ఇద్దరు సస్పెండ్‌

APSRTC: బస్సు ప్రమాద ఘటనలో ఇద్దరు సస్పెండ్‌
అధికారుల నివేదికతో చర్యలు... కడప బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

విజయవాడ బస్టాండ్ లో ప్లాట్ ఫాంపైకి బస్సు దూసుకెళ్లి ముగ్గురు మృతిచెందిన ఘటనపై APSRTC యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సిఫారసుల మేరకు డ్రైవర్ , ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. డ్రైవర్ ప్రకాశం, అసిస్టెంట్ డిపో మేనేజర్ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు వేసింది.ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అంతకుముందుతప్పుగా గేర్ వేయడం వల్లే బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకుపోయిందనిరవాణాశాఖ అధికారుల కమిటీ తేల్చింది. డ్రైవర్ కు శిక్షణ ఇవ్వకుండా బస్సు అప్పగించారని బస్సులోని ఆటోమెటిక్ గేర్ సిస్టంపై సరిగా అవగాహన లేనందునే ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లతోనే ఆ బస్సు నడపాల్సి ఉండగా అలా చేయలేదని తెలిపింది. డ్రైవర్ ప్రకాశంకు సూపర్ లగ్జరీ బస్సు నడపడంలో అపార అనుభవం ఉందని, అటోమేటిక్ గేర్ సిస్టంపైనే.. సరైన అవగాహన లేదని నివేదిక పేర్కొంది.


మరోవైపు విజయవాడ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపిన రవాణా శాఖ అధికారుల కమిటీ డ్రైవర్ కు సరైన శిక్షణ ఇవ్వకుండా డిపోలోని ఆర్టీసీ అధికారులు బస్సు అప్పగించినట్లు తేల్చింది. డ్రైవర్ కు బస్సులోని ఆటో మేటిక్ గేర్ సిస్టంపై సరిగా అవగాహన లేదని అందువల్లే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లతోనే బస్సు నడపాల్సి ఉండగా అలా చేయలేదని తెలిపింది. నివేదికను అధికారుల బృందం రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించింది. రవాణా శాఖ నివేదికలోని అంశాలపైన ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమీక్షిస్తున్నారు. పోలీసు, ఆర్టీసీ అధికారుల దర్యాప్తు అంశాల ఆధారంగా చర్యలపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.


విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ఘటన మరవకముందే కడప బస్టాండ్ లో అద్ తరహాలో మరో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు...సంధ్య కూడలికి రాగానే బ్రేకులు పడలేదని డ్రైవర్ గుర్తించాడు. ప్రయాణికులు ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆర్టీసీ ప్రాంగణంలోకి బస్సును తీసుకెళ్లాడు. పార్కింగ్ చేసేలోపల బ్రేకులు పనిచేయకపోవడంతో ఎదురుగా ఇద్దరు వ్యక్తులను ఢీకొన్నాడు. విషయం తెలుసుకున్నడిపో అధికారులు బస్సును పరిశీలించగా పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story