డీజీపీకి మరో లేఖ రాసిన వర్ల రామయ్య

డీజీపీకి మరో లేఖ రాసిన వర్ల రామయ్య
ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖపై పోలీసులు స్పందన తీరు గర్హనీయమన్నారు ఆ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఈ మేరకు డీజీపీకి ఆయన మరో లేఖ రాశారు. అసలు ముద్దాయిలను..

ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖపై పోలీసులు స్పందన తీరు గర్హనీయమన్నారు ఆ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఈ మేరకు డీజీపీకి ఆయన మరో లేఖ రాశారు. అసలు ముద్దాయిలను త్వరగా అరెస్ట్ చేయమని చంద్రబాబు కోరడం తప్పా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ తీరు భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని వర్ల రామయ్య ఆక్షేపించారు. రాజమండ్రిలో ముస్లిం బాలికపై అత్యాచారయత్నం కేసులో.. ముద్దాయిల అరెస్టులో జాప్యమెందుకని ప్రశ్నించడం తప్పా? ముద్దాయిలను ఎప్పుడు అరెస్టు చేశారు? ఫిర్యాదు వాపస్‌ తీసుకోవాలని బాధితుల ఇంటిపై.. దాడి చేసి తల్లిదండ్రుల్ని బెదిరించింది నిజం కాదా? బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నానికి కారణం పోలీసులు చెప్పగలరా?..

ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలపై.. రాజమండ్రి వాసులకు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ఇవ్వగలరా? అంటూ వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. అటు.. లేఖలో వర్ల రామయ్య మరికొన్ని కేసులను కూడా ప్రస్తావించారు. సీతానగరం శిరోముండనం కేసులో ఎస్సై ఫిరోజ్‌ ఫోన్‌కాల్‌ లిస్ట్‌ పరిశీలించి అసలు ముద్దాయిలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఫోన్‌కాల్‌ లిస్ట్‌ పరిశీలించి దళిత యువకుడు ప్రతాప్‌ ఆత్మహత్యకు కారకులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? పల్నాడులో దళిత యువకుడు విక్రమ్ హత్యకు పరోక్ష కారకుడిగా చెప్పబడుతున్న సీఐ దుర్గాప్రసాద్‌ కాల్‌లిస్ట్‌ ఎందుకు పరిశీలించలేదు? దళిత కుటుంబంలో ఆరుగురిని సజీవ దహనం చేయడానకి ప్రయత్నించిన అసలు ముద్దాయిలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.

అటు.. పోలీసులు వెంటనే స్పందించకపోవడం వల్లే అత్యాచార కేసులు పెరుగుతున్నది నిజం కాదా? దర్యాప్తులు పర్యవేక్షిస్తున్న సీనియర్‌ పోలీసు అధికారులు కాకుండా.. ఆఫీసులో కూర్చునే టెక్నికల్‌ డీఐజీ ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబును తప్పుపట్టడం సబబేనా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా డీజీపీ ఈ కేసులన్నింటిని సమీక్షించాలని.. యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ప్రజలముందుంచాలని వర్ల రామయ్య సూచించారు. ఇన్ని లేఖలు రాసినా.. చంద్రబాబు ఏ ముద్దాయి పేరును చెప్పడం కానీ.. సూచించడం కానీ జరగలేదని వర్ల గుర్తు చేశారు. అసలు నేరస్తులను అరెస్ట్‌ చేయమని కోరడం తప్పా? ఈ విధమైన పోలీసు శాఖ స్పందన రాజకీయ ప్రోద్భలంతో కాదా? అని వర్ల ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story