Visakhapatnam Rushikonda: విశాఖ రుషికొండలో మరో విధ్వంసం

Visakhapatnam Rushikonda: విశాఖ రుషికొండలో మరో విధ్వంసం
వైసీపీ ప్రభుత్వమే సైలెంట్‌ గా చర్యలకు పాల్పడుతుందన్న విమర్శ లొస్తున్నాయి


విశాఖలో రుషికొండ ధ్వంసంతో ఇప్పటికే పచ్చదనం కనుమరుగైపోతోంది.మళ్లీ ఇప్పుడు మరో విధ్వంసానికి రంగం సిద్ధమైంది. భీమిలి దగ్గర్లో ఉన్న వరల్డ్ ఫేమస్‌ ఎర్రమట్టి దిబ్బలకు ముప్పు ఏర్పడనుంది. అయితే వైసీపీ ప్రభుత్వమే సైలెంట్‌ గా చర్యలకు పాల్పడుతుందన్న విమర్శ లొస్తున్నాయి.ఈ పరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో అభివృద్ధి పనుల కోసం చేపట్టిన భూ సమీకరణకు భీమిలి మండలం నేరెళ్లవలస గ్రామంలోని 94 నుండి 100 సర్వే నంబర్లలో ఉన్న 32 ఎకరాలను గుర్తించారు. అయితే రెవెన్యూ రికార్డు ప్రకారం అవి ఇసుక భూములు.వీటికి ఆనుకొనే ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి.ఎర్రమట్టి దిబ్బలకు ఓవైపు సముద్రం, మరోవైపు ఐఎన్‌ఎస్‌ కళింగ, ఇంకోవైపు హౌసింగ్‌ సొసైటీ స్థలాలు ఉన్నాయి. పశ్చిమం వైపు తోటలున్నాయి.అయితే ఇక్కడి భూమలను రక్షించాల్సి ఉన్నా.. అక్కడే విధ్వాంసం సృష్టిస్తున్నారు.

మరోవైపు ఎర్రమట్టి దిబ్బలు దక్షిణాసియాలో మూడు చోట్లే ఉన్నాయి. దాదాపు 18వేల సంవత్సరాల కిందటి నుంచి ఏర్పడుతూ వస్తున్నట్లు చరిత్ర చెపుతోంది.ఇసుక రేణువులు గాలులకు ఎగురుతూ కాలక్రమంలో దిబ్బలుగా ఏర్పడ్డాయి.సముద్ర ఆటుపోట్లు, వాతావరణ మార్పులతోల్ల ఏర్పడ్డ ఈ ప్రాంతాన్ని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అత్యంత అరుదైన ప్రదేశంగా 2014లో జియో హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ఇక్కడికి దగ్గర్లో నిర్మాణ పనులు, బ్లాస్టింగ్స్‌ వంటివి నిషేధం..వీటి ఉనికి భంగం కలిగిస్తే అది చట్టవ్యతిరేకం అవుతుంది. అయితే ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంత సంరక్షణ బాధ్యతలన్నీ చూసుకోవాల్సిన సర్కారే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇక ఎర్రమట్టి దిబ్బల దగ్గర చెట్లు నరికివేయడంతో ఎడారిని తలపిస్తోంది. టూరిజం సంస్థ వాచ్‌టవర్‌ ప్రాంతంలో భారీగా చదును చేశారు.అక్కడున్న చెట్లను తొలగించేశారు. మిషన్లతో పచ్చదనాన్ని నామరూపాల్లేకుండా చేశారు.భూములు చదును చేసినచోట వందల సంఖ్యలో జీడిమామిడి, మామిడి, తాడిచెట్లు ఉండేవి.ఎర్రమట్టి దిబ్బలను ఆనుకొని ఉన్న వాటిని కూకటి వేళ్లతో పెకలించడం వల్ల భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుంది.చెట్ల వేళ్లు భూమి లోపలివరకు వెళ్లి, మట్టి జారిపోకుండా చేస్తాయి.ఈ చెట్లను నరికేసి లేఅవుట్లు వేసి బిల్డింగ్‌లు కడితే ఎర్రమట్టి దిబ్బలకు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి.భవిష్యత్తులో దిబ్బలు కుంగిపోయే ప్రమాదం కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story