Viveka Murder Case: వివేకా హత్యకేసుపై సుప్రీం సీరియస్
By - Subba Reddy |20 March 2023 11:45 AM GMT
దర్యాప్తు ఎందుకు పూర్తి చేయట్లేదని తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. విచారణ ఎంత వరకు వచ్చిందో చెప్పాలంది. కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయట్లేదన్న సుప్రీం తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారన్నది. ఈ కేసు విచారణను త్వరగా ముగించకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదన్న సుప్రీం దర్యాప్తు అధికారి మార్పుపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరుపు న్యాయవాదిని ఆదేశించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com