పింక్ డైమండ్ వ్యవహారం ఏమైంది? : స్వామి పరిపూర్ణానంద
2019 ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా మారిన పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని.. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

X
Vamshi Krishna8 April 2021 10:47 AM GMT
2019 ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా మారిన పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని.. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసం ఆ వివాదం సృష్టించారా.. లేక నిజంగానే అది ఉందా చెప్పాలని నిలదీశారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి... వివాదాల పుట్టగా మారిపోయిందని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీ ఎందుకు తీసుకురారో చెప్పాలంటూ సీఎం జగన్‌కు ప్రశ్నలు సంధించారు. తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై.. 25సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలని స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story