VRO చెంప చెల్లుమనిపించిన మహిళ

VRO  చెంప చెల్లుమనిపించిన మహిళ
మహిళా రైతు భూమిని హోల్డ్ లో పెట్టిన VRO


కర్నూలు జిల్లా గోనెగండ్లలో రెవిన్యూ అధికారులపై మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేసింది.VRO చెంప చెల్లుమనిపించింది.పెద్ద నెలటూరు గ్రామానికి చెందిన చాకలి వీరన్న, శివాపార్వతిలు సర్వే నంబర్ 430 లో తొమ్మిది ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు.. వారి పెద్దల కాలం నుండి ఆ పొలాన్ని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2014 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన చాకలి రాముడు సర్వే నంబర్ 430 లో ఉన్న తొమ్మిది ఎకరాల భూమిలో రెండు ఎకరాలు భూమిని అప్పటి VRO వేణుగోపాల్ సహకారంతో ఆ భూమిని ఆన్‌లైన్ లో ఎక్కించుకొన్నాడు. ఆ తరువాత పొలం తనదే అంటూ కోర్టుకు వెళ్లాడు. తమ పొలం కబ్జాకు గురైందని,తమకు న్యాయం చేయాలనీ అప్పటి నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.కబ్జాకుగురైన రెండు ఎకరాలతో పాటు మిగిలి ఉన్న ఏడు ఎకరాలు భూమి కుడా రెవిన్యూ అధికారులు హోల్డ్ లో పెట్టారు. దీంతో సర్వే నంబర్ లో ఉన్న మొత్తం తొమ్మిది ఎకరాలు రెడ్ మార్క్ ఉండటంతో వారికీ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి.

మరోవైపు కబ్జాకు గురైన రెండు ఎకరాలు భూమి ను వదిలి మిగిలిన ఏడు ఎకరాల భూమి ను హోల్డ్ లో తొలగించాలని ఉన్నతాధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది..అయితే VRO వేణుగోపాల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న విషయం తెలుసుకున్న వీరన్న,శివ పార్వతులు అక్కడికి చేరుకొని తమకు న్యాయం చేయాలనీ ఆందోళన చేపట్టారు. వారికీ సమాధానం చెప్పలేక కార్యాలయంలో ఉన్న తహసిల్దార్ బయటికి వెళ్లడంతో అక్కడే ఉన్న VRO వేణుగోపాల్ తో వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్యలో మాటా మాట పెరగడంతో .. ఆ మహిళా రైతు వీఆర్వో చెంప చెల్లుమనిపించింది.తమకు అన్యాయం చేసిన VRO చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని,కనీసం కబ్జాకు గురైన రెండు ఎకరాల భూమిని వదిలి మిగతా భూమిని హోల్డులో నుంచి తీసేయాలని కోరింది మహిళా రైతు.

Tags

Read MoreRead Less
Next Story