MP అవినాష్‌రెడ్డిపై CBI ప్రశ్నల వర్షం

MP అవినాష్‌రెడ్డిపై CBI ప్రశ్నల వర్షం
వివేకా హత్యకేసులో MP అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు CBI విచారించింది. వాట్సాప్‌ కాల్స్, నిందితులతో పరిచయాలపై ఆరా తీసింది

వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. వాట్సాప్‌ కాల్స్, నిందితులతో పరిచయాలపై ఆరా తీసింది. వివేకా హత్యకు వాడిన గొడ్డలి ఎక్కడిదని.. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక.. వివేకా మరణంపై జగన్‌కు ముందుగా ఎవరు చెప్పారని సీబీఐ ఆరా తీసింది.

అయితే.. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్‌ సీబీఐకి తెలిపారు. ఈ కేసులో ఉమా శంకర్ రెడ్డి సోదరుడు జగదీశ్ రెడ్డిని కూడా సీబీఐ విచారించింది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో విచారణ చేపట్టగా.. మొత్తం ఆడియో, వీడియో రికార్డ్‌ చేశారు.

అవినాష్‌రెడ్డి ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని.. ముందస్తు బెయిల్ తీర్పులో కోర్టు ఆదేశించింది. శనివారంతో పాటు మిగిలిన రోజుల్లో విచారణ చేయాలనుకుంటే నోటీస్ ఇచ్చి పిలవొచ్చని సీబీఐకి ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story