Election Rules : జగన్‌ ‘బొమ్మ’ తియ్యక తప్పదు

Election Rules : జగన్‌ ‘బొమ్మ’ తియ్యక తప్పదు
ఎన్నికల నియమావళి అమలులో భాగమే

ప్రచార పిచ్చి కోసం ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టిన CM జగన్‌ తిక్కను ఎన్నికల సంఘం కుదిర్చింది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలపై ఉన్న జగన్‌ బొమ్మను మడతపెట్టింది. జగన్‌ ముద్ర ఉన్న ఏ పత్రాలూ జారీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు వందల కోట్ర ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు?

ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రికీ రాని వింత ఆలోచనజగన్‌కే వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీటిపైనా జగన్‌ తన బొమ్మను అచ్చేయించుకున్నారు. అదేదో ప్రభుత్వ అధికార గుర్తైనట్టు నవరత్నాల లోగో ముద్రించారు. 1బీ, అడంగల్, భూయాజమాన్య హక్కు పత్రం, ఫ్యామిలీ మెంబర్‌ ధ్రువీకరణ పత్రంఇలా గ్రామ, వార్డు సచివాలయాలు,మీ సేవా కేంద్రాలద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలపై. తన బొమ్మ ముద్రించుకున్నారు. రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు, ప్రతి ప్రభుత్వ కార్యంలోనూ జగన్‌ బొమ్మను ముద్రించుకునన్నారు. నవరత్నాల లోగోను వేయించారు జగన్‌ పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది. ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యాజగన్‌ ముద్రతో ఉన్న ఏ ధ్రువపత్రాలూ జారీ చేయొద్దనని ఆదేశాలిచ్చింది.

వైకాపా ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఉచితంగా ఇచ్చేందుకు అంటూ భారీగా ధ్రువపత్రాలు ముద్రించింది. ఒక్కో పత్రం ముద్రణకు 50రూపాయల పైనే ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కోచోట ఇలాంటి పత్రాలు వందల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టాలని క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే ఇవి చెల్లవని తెలిసీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్‌. దీనికి బాధ్యత వహిస్తారా? తన జేబులో నుంచి డబ్బు చెల్లిస్తారా?

జగన్‌ ప్రచార పిచ్చి మీసేవా నిర్వాహకుల కొంప ముంచింది. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల వరకూ మీసేవ కేంద్రాలున్నాయి. వీటి నిర్వాహకులు 3రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి జగన్‌ బొమ్మ ఉన్న ఒక్కో పత్రాన్నితీసుకున్నారు. ఒక్కో మీసేవా కేంద్రంలోఇలాంటివి వెయ్యి నుంచి 2 వేల వరకు ధ్రువపత్రాలు నిల్వ ఉన్నాయి. EC ఆదేశాలతో అవన్నీ నిరుపయోగమైనట్లేనని మీసేవా నిర్వాహకులు వాపోతున్నారు. కనీసం 3వేల నుంచి, 6వేల రూపాయల వరకూ నష్టమని లబోదిబోమంటున్నారు. రెండ్రోజులుగా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 1బీ, అడంగల్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాలను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. పత్రాలు అందుబాటులో లేక వారిని వెనక్కి పంపించేస్తున్నారు. అధికారులు మాత్రం జగన్‌ బొమ్మ, నవరత్నాల లోగో లేని పత్రాలను జిల్లాలకు పంపించినట్టు చెబుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story