Silk Reeling Centers: సిల్క్ రీలింగ్‌ యూనిట్లకు కష్టకాలం

Silk Reeling Centers: సిల్క్  రీలింగ్‌ యూనిట్లకు కష్టకాలం
పట్టుగూళ్ల మార్కెట్​లో రీలింగ్ యూనిట్లు మూసేస్తున్న యజమానులు

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామంటూ పాదయాత్ర సమయంలో జగన్ హోరెత్తించారు కానీ.....ఆయన సీఎం అయ్యాక కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు....ఉన్న ఉపాధీ కోల్పోతున్న పరిస్థితి దాపురించింది. తెలుగుదేశం ప్రభుత్వం పట్టుగూళ్లు సాగుచేసే రైతులకు, సిల్క్ దారం ఉత్పత్తి చేసే రీలింగ్ యూనిట్లకు....అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించగా....జగన్ ప్రభుత్వంలో మాత్రం..వారి పరిస్థితి ఆయన పాలన మాదిరిగానే రివర్స్‌ అయ్యింది. పట్టుగూళ్లకు పేరొందిన హిందూపురంలో సిల్క్ రీలింగ్ కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.

బెంగుళూరులోని రామనగర పట్టుగూళ్ల మార్కెట్‌కు ఆసియాలో తొలిస్థానం కాగా.... హిందూపురం మార్కెట్ రెండో స్థానంలో ఉంది. ఇదంతా జగన్ సీఎం పీఠం ఎక్కక ముందు పరిస్థితి. ఎందుకంటే ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో..... పట్టుగూళ్లు సాగుచేసే రైతు నుంచి.... దారం తీసే రీలింగ్ కేంద్రాల యజమానుల వరకు అందరూ ఇక్కట్లు పాలవుతున్నారు. కరోనా దెబ్బకు హిందూపురం పట్టు మార్కెట్ కుదేలు కాగా...ఆదుకోని జగన్ ప్రభుత్వ తీరు రీలింగ్ కేంద్రాల యజమానులను మరింత కుంగదీస్తోంది. పట్టుదారం రీలింగ్ యూనిట్లకు ఇచ్చే ఇన్సెంటివ్‌లు ఆగిపోయాయి. విద్యుత్ బిల్లులు3 రెట్లు పెరిగిపోయాయి. యజమానులు అప్పుల ఊబిలో కూరకుపోయి అనేక యూనిట్లు మూతవేశారు.


పట్టుగూళ్లు సాగుచేసే రైతులకు మార్కెట్ ధరకు అదనంగా ప్రతి కిలోపై ప్రభుత్వం 50 రూపాయలు ప్రోత్సాహక ధర ఇస్తుంది. కానీ మల్బరీ రైతులకు జగన్ ప్రభుత్వం 60 కోట్లు బకాయిపడింది. రైతుల నుంచి పట్టు గూళ్లు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ తో దారం ఉత్పత్తి చేసే రీలింగ్ కేంద్రాలకు.... కిలో దారం ఉత్పత్తికి 130 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తున్నారు. రీలర్లకు జగన్‌ సర్కార్‌ 29 నెలలుగా ఈ మొత్తం విడుదల చేయలేదు. ఒక్క హిందూపురం రీలర్లకే 3 కోట్ల 80 లక్షలు జగన్ సర్కారు బకాయిపడింది. 2019లో ఎన్నికల ప్రచారానికి హిందూపురం వెళ్లిన జగన్‌... మల్బరీ రైతులకు, రీలింగ్ యూనిట్ల యజమానులకు అనేక హామీలు ఇచ్చారు. ఆ తర్వాత మాట తప్పారు.

పట్టు రీలింగ్ కేంద్రాల ప్రాధాన్యతను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం....వారి విద్యుత్ కనెక్షన్ ను మూడో కేటగిరిలో పెట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక, రీలింగ్ కేంద్రాలను నాలుగో కేటగిరీలోకి మార్చారు. వారికి గతంలో వచ్చే విద్యుత్ బిల్లు మొత్తం 3 రెట్లు పెరిగింది. ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ రెండేళ్లకు పైగా బకాయి పడటం, కేటగిరీ మార్పుతో విద్యుత్ ఛార్జీ అమాంతం పెరగటంతో రీలింగ్ కేంద్రాల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.

.

Tags

Read MoreRead Less
Next Story