72 Hoorain : బహత్తర్ హురైన్ ఎందుకు చూడాలంటే!

72 Hoorain : బహత్తర్ హురైన్ ఎందుకు చూడాలంటే!
జీహాద్ లో పాలుపంచుకుంటే 72 దేవకన్యలు దక్కుతారా..

సినిమా హిట్ట్ అవ్వాలి అంటే దానిలో కాంట్రవర్సీ ఉండాలి. అలా తియ్యడానికి కూడా ధైర్యం కావాలి. ఏదో ఒక మతాన్ని లేదా మతానికి సంబంధించిన అంశాన్ని ద్రుష్టి లో పెట్టుకొని వస్తున్న సినిమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నిజానికి అలాంటి సినిమాలు ఒక వర్గానికి నచ్చకపోవచ్చు.. దీనివల్ల పెద్ద వివాదం కూడా జరగచ్చు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలు ఆ కోవకు చెందినవే. ఇప్పుడు అదే తరహాలో వచ్చిన చిత్రం 72 హూరెన్.

గతంలో లాహోర్ చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్న సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దీనికి దర్శకత్వం వహించారు. టెర్రరిజం, టెర్రరిస్టుల మనస్తత్వంపై నేరుగా దాడి చేసేలా ఉన్న ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి రోజు పెద్దగా వసూళ్లు లేకపోయినప్పటికీ ఈ సినిమా కాస్త ఇంటెన్స్ గా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ లోనే యాకూబ్ మెమన్, ఒసామా బిన్ లాడెన్, అజ్మల్ కసబ్, మసూద్ అజర్, హఫీజ్ సయీద్, సాదిక్ సయీద్, బిలాల్ అహ్మద్, హకీమ్ అలీ వంటి భయంకరమైన ఉగ్రవాదులను వారి ఫోటోలను నేరుగా ప్రస్తావించటం సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సినిమా ఉగ్రవాదుల దురుద్దేశాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించినది. రిలీజ్ కి ముందే ఈ సినిమా మొదటిసారిగా 2019 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శించబడింది, ప్రత్యేక బహుమతి పొందింది. అలాగే 2020లో దర్శకత్వ విభాగంలో ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

జీహాద్ లో పాలు పంచుకున్న వ్యక్తులు జన్నత్ కి వెళతారని, అక్కడ వారికి 72 మంది దేవ కన్యలు దక్కుతారు అని చెప్పటమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అయితే జిహాద్ లో పేదవారు మాత్రమే ఎలా టార్గెట్ అవుతారు అన్న విషయం చూపించే పద్ధతిలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. గేట్‌వే ఆఫ్ ఇండియాను పిల్చేయడానికి హకీమ్, బిలాల్లను సిద్ధం చేసేందుకు గానూ వారికి ఈ పని చేస్తే స్వర్గంలో బహత్తర్ హురైన్ (72 మంది అందమైన కన్యలు) బహుమతి లభిస్తుందని నమ్మించడానికి ఎలా బ్రెయిన్‌వాష్ చేశారు అనేది సినిమాలో మెయిన్ ప్లాట్. అయితే చివరికి ఆత్మహత్య దాడి చేసి మరణించిన తర్వాత వారు ఇద్దరు నిజంగా 72 మంది కన్యలను పొందారా లేదా అన్నది తెరపై చూడాల్సిందే. ఎందుకంటే వారిద్దరి మరణం తరువాత ఏం జరిగింది అనేది కూడా సినిమాలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story